ప్రపంచ కుబేరుడుగా ఎలాన్ మస్క్..

by సూర్య | Fri, Jan 08, 2021, 10:21 AM

టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. 500 మంది కుబేరులతో బ్లూమ్‌బర్గ్ రూపొందించిన బిలియనీర్స్ జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరిట, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎల్ఎల్‌సీ పేరిట ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కంపెనీలు నిర్వహిస్తుండగం గమనార్హం


ఎలాన్ మస్క్ సంపద నికర విలువ గురువారం నాటికి 188.5 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.14.13 లక్షల కోట్లు. ఈ సంపద విలువతో అక్టోబర్ 2017 నుంచి అపర కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్( Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించాడు. ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విలువ గురువారం 7.4 శాతం పెరిగి.. 811 డాలర్ల గరిష్ట స్థాయికి చేరడంతో ఆయన అత్యంత ధనవంతుడు అయ్యారు.


గత ఏడాది ఎలాన్ మస్క్(Elon Musk) సంపద విలువ ఏకంగా 150 బిలియన్ డాలర్లకు పైగా పెరగడం గమనార్హం. ఆయనకు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ ఏడాది వ్యవధిలో ఏకంగా 743శాతం మేర పెరిగింది. ఇది టయోటా, ఫోక్స్ వ్యాగన్, జీఎం మరియు ఫోర్డ్ కలిపినా.. దాని కన్నా అధిక విలువైన కార్ల కంపెనీ విలువతో సమానం.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM