ముక్కు ద్వారా వేసే టీకా: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

by సూర్య | Mon, Oct 19, 2020, 02:14 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రపంచంలోని అనేక దేశాలు టీకా కనిపెట్టే పనుల్లో నిమగ్నమైన విషయం తెలిసిందే. భారత్ కూడా ఈ పోటీలో ముందు వరుసలో ఉంది. ముక్కు ద్వారా వేసే టీకాకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌   తెలిపారు.


ప్రాథమిక దశ తర్వాతి దశ ట్రయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ చేపట్టనున్నట్టు వివరించారు. డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ ట్రయల్స్‌కు త్వరలోనే అనుమతించనుందని తెలిపారు. కొన్ని నెలల వ్యవధిలోనే భారత్‌లో 'ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌' అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.


కాగా, ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మూడో దశ వ్యాక్సిన్‌ ప్రయోగాలు అన్నీ ఇంజక్షన్‌ రూపంలో ఉన్నాయని ఇటీవలే డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. అయితే, భారత్ మాత్రం  ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలను చేపట్టనున్నట్టు చెప్పడం గమనార్హం.  చివరిదశ ప్రయోగాలను భారత్‌లో భారీస్థాయిలో చేపట్టనున్నట్లు,  30 నుంచి 40 వేల మంది వలెంటీర్లపై ప్రయోగించే అవకాశమున్నట్లు హర్షవర్ధన్ చెప్పారు.

Latest News

 
ఓటు కోసం ఊరులు దాటుతున్న నేతలు Fri, Apr 26, 2024, 06:43 PM
తెనాలి పోలీసులపై చర్యలు Fri, Apr 26, 2024, 06:43 PM
వైరల్ అవుతున్న భువనేశ్వరి ఆడియో, అని ఫేక్ అంటున్న లోకేష్ Fri, Apr 26, 2024, 06:42 PM
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM