కరోనా పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు డాన్స్ చేసిన డాక్టర్

by సూర్య | Mon, Oct 19, 2020, 01:35 PM

అసోంకు చెందిన డాక్టర్‌ అరూప్‌ సేనాపతి ఆసుపత్రిలో డ్యాన్స్ చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు సేవల అందిస్తోన్న సమయంలో ఇలా డ్యాన్స్ చేశారు. కరోనా పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్‌ లోనే ఆయన డ్యాన్స్ చేశారు.  


'వార్‌' సినిమాలోని ఘంగ్రూ పాటకు  ఆయన స్టెప్పులు వేయడాన్ని ఆక్ష్న సహోద్యోగి డాక్టర్‌ ఫైజన్‌ అహ్మద్ వీడియో తీసి‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది. అసోంలోని సిల్చార్‌ మెడికల్‌ కాలేజీలో ఆయన డ్యాన్స్ చేశారని ఫూజన్ వివరించారు.  ఈ వీడియో రెండు లక్షల మందికి పైగా చూశారు. ఇటువంటి వైద్యులు ఉంటే పేషెంట్లకు బాధలు ఉండవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Latest News

 
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM
రైతు పై ఎలుగుబంటి దాడి Fri, Mar 29, 2024, 01:04 PM
కంబదూరులో పిల్లవాడి కిడ్నాప్ యత్నం విఫలం Fri, Mar 29, 2024, 01:00 PM
టిప్పర్ ఢీకొని యువకుడు మృతి Fri, Mar 29, 2024, 12:57 PM