జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం...

by సూర్య | Sun, Oct 18, 2020, 11:36 AM

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల పండుగ మొదలైంది. నేడు బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. 56 బిసి కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లను ప్రభుత్వం ప్రకటించనుంది. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 30వేలకు పైబడి జనాభా కలిగిన బిసి కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఈ పోస్టుల భర్తీలో 50శాతం రిజర్వేషన్లను మహిళలకు కేటాయించారు. దీంతో పురుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు చైర్మన్ పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. 56 చైర్మన్ పోస్టుల్లో 29 మంది మహిళలు, 27 మంది పురుషులకు కేటాయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 728 డైరెక్టర్ల పదవుల్లో 364 మహిళలకు కేటాయించినట్లు సమాచారం. అలాగే చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM