తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి

by సూర్య | Sun, Oct 18, 2020, 11:49 AM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటీవల తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో అధికారులు 33 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే, ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో తెరిచిన గేట్లను అధికారులు తిరిగి మూసివేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100 టీఎంసీలుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 13,399 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 13,400 క్యూసెక్కులుగా ఉన్నట్టు డ్యామ్ అధికారులు తెలిపారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM