కరోనా నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి నిబంధనలు

by సూర్య | Fri, Oct 16, 2020, 08:51 AM

కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం, పంపానదిలో స్నానాలకు అనుమతి లేదని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. వర్చువల్‌ క్యూపోర్టల్‌ ద్వారా దర్శనం కోసం భక్తుల నవెూదు తప్పనిసరి  అని పేర్కొంది. రాష్ట్రంలోని అయ్యప్ప భక్తుల సమాచారం నిమిత్తం శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ కేరళ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. భక్తులు వెబ్‌సైట్‌ ద్వారా నవెూదు చేసుకునే అవకాశం ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రోజు  వెయ్యి మంది, వారాంతంలో రోజుకు 2 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు వెల్లడించారు. దర్శనానికి 48 గంటల ముందు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి అని పేర్కొన్నారు. పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు దర్శనానికి అనుమతి లేదని కేరళ ప్రభుత్వం తెలిపింది.


 

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM