కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

by సూర్య | Mon, Oct 12, 2020, 07:55 PM

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలతో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగున్నాయి. మరోవైపు, ఈ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్రం చెపుతోంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించే వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థ కుప్పకూలుతుందని పిటిషనర్లు ఆందోళన వెలిబుచ్చారు.


ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM