ఏపీ కరోనా బులిటెన్...

by సూర్య | Mon, Oct 12, 2020, 07:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టింది. గత నెల రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు చాలా తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రోజులో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో డిశ్చార్జ్‌ అవుతున్నారు. గత 24 గంటలుగా ఏపీలో 3,224 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 7,58,951కు చేరింది. గత 24 గంటల్లో 5,504 మంది కరోనాను జయించారు.


కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 32 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకూ 6,256 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 43,983 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,08,712 ఇప్పటివరకూ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 66.30 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు, అనంతపురంలో ఇదివరకూ పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యేవి.. కానీ ఇప్పుడు ఈ జిల్లాల్లో కరోనా ఉధృతి చాలా వరకూ తగ్గింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM