ఈ మెంటల్ ముఖ్యమంత్రి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది : లోకేష్

by సూర్య | Mon, Oct 12, 2020, 04:17 PM

ఎన్నికల ముందు అమరావతికి అనుకూలమని జగన్ చెప్పింది ‌వాస్తవం‌ కాదా? అని టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. అనంతవరంలో రైతులకు నారా లోకేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి..మడమ తిప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ మెంటల్ ముఖ్యమంత్రి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ఏపీ నుంచి పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని పేర్కొన్నారు. సొంత డబ్బుతో రైతులు ఢిల్లీ‌ వెళ్తే బూతులు తిడుతున్నారని చెప్పారు. జగన్ తన కేసుల కోసం ప్రజాధనంతో ఢిల్లీ వెళ్లారని చెప్పారు. సీఎం, మంత్రులకు బాధ్యత కాకుండా బలుపు పెరిగిందన్నారు. రైతులను తిడుతున్న మంత్రులను ఆపాల్సిన జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 2024లో చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా అమరావతి సాధించే వరకు వెనుతిరిగేది లేదన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM