దేశంలో తగ్గని కరోనా ఉధృతి..

by సూర్య | Mon, Oct 12, 2020, 10:20 AM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా రోజుకు 50వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 66,732 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం పేర్కొంది. మహమ్మారి కారణంగా కొత్తగా 816 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి చేరింది. ఇందులో 8,61,853 క్రియాశీల కేసులున్నాయి. 61,49,536 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 1,09,150 మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఆదివారం ఒకే రోజు 9,94,851 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పేర్కొంది. ఇప్పటి వరకు 8,78,72,093 టెస్టులు చేసినట్లు వివరించింది.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM