నిరుద్యోగులకు శుభవార్త..

by సూర్య | Mon, Oct 12, 2020, 11:20 AM

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 33 మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తరాఖండ్ లోని కొట్వాడ యూనిట్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ట్రైనీ, ప్రాజెక్టు ఇంజనీర్, ట్రైనీ, ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుల కోసం ఈ నియామకం చేపట్టారు. ప్రాజెక్టు ఇంజనీర్ గా, ఆఫీసర్ గా ఎంపికైన వారు నాలుగేళ్ల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వారికి రూ. 50 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ట్రైనీ ఇంజనీర్ మరియు ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మూడేళ్ల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారికి రూ. 31 వేల వరకు వేతనం ఇవ్వనున్నారు.


ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఎండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ తరితర ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ కోర్సులు చదివిన వారు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ మేరకు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


మొత్తం 33 పోస్టుల్లో 19 ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అర్హతతో 10, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో 2, మెకానికల్ ఇంజనీరింగ్-5, సివిల్ ఇంజనీరింగ్-1, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 1 పోస్టును భర్తీ చేయనున్నారు. 11 ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అర్హత ఉన్న వారికి 5, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అర్హత ఉన్న వారికి 6 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ ఆఫీసర్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవాడనికి అర్హులు. ప్రాజెక్ట్ అధికారి విభాగంలో 1 పోస్టు ఖాళీగా ఉంది. ఎంబీఏ లేదా MSV విద్యార్హత కలిగిన వారు వారు ఇందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించడానికి ఆసక్తి కలిగిన వారై ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జాబ్ పోస్టింగ్ ఉన్న ప్రదేశాలకు రీ లొకేట్ కావడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.


ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి 21 వరకు BEL అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రైనీ ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఆఫీసర్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను పైన ఇచ్చిన ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.bel-india.in ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM