ఐపీఎల్ 2020: చెన్నై- బెంగళూర్ పోరులో గెలుపెవరిది?

by సూర్య | Sat, Oct 10, 2020, 05:11 PM

ఐపీఎల్ 13 లో భాగంగా నేడు దుబాయ్ లో చెన్నై, బెంగళూర్ జట్లు తలపడనున్నాయి.ఐపీఎల్ లో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య మొత్తం 24 మ్యాచులు జరగ్గా, చెన్నై 15, బెంగళూర్ 8 మ్యాచ్ ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక తాజాగా దుబాయ్ లో జరుగనున్న మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. మరి ఇరు జట్ల బలాబలాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.


గెలవాలన్న వ్యూహంతో..


పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తన సామర్థ్యమెంతో చూపించిన చెన్నై జట్టు.. కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో తడబడింది. ఐతే, పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్‌ మురళీ విజరు స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన షేన్‌ వాట్సన్‌ ఆ తర్వాత కొంత తేరుకున్నాడు. అయితే, పూర్తి స్థాయిలో ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంబటి రాయుడు, డుప్లెసిస్‌, రవీంద్ర జడేజా, శామ్‌ కరన్‌ సహా కేదార్‌ జాదవ్‌, ఎం.ఎస్‌ ధోనీలు మంచి ఫామ్‌లో ఉన్నారు. లుంగి ఎంగిడి, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లాలతో బౌలింగ్‌ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది.


గెలవాలని ఆత్రంగా..


ఢిల్లీతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బెంగళూర్ జట్టు ఈసారి ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నది. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే బెంగళూర్ యువ క్రీడాకారుడు దేవదత్‌ పడిక్కల్ అదరగొట్టాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ చేయలేని పని యువ దేవదత్‌ పడిక్కల్‌ చేసి చూపించాడు. అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. రెండో మ్యాచ్ లో జట్టు ఓటమి పాలైనా టీమ్ నిరుత్సాహంతో లేరు. టాప్‌ ఆర్డర్‌లో పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌ రాకతో రాయల్‌ చాలెంజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే పూర్తిగా ఆధార పడాల్సిన అవసరం లేదనే దీమా ఆ జట్టులో కనిపిస్తోంది. ఇక విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ల ప్రదర్శన ఈ సీజన్ లో అంతంత మాత్రంగానే ఉంది. బౌలింగ్‌లో బెంగళూర్‌ జోరుమీదుంది. డెల్‌ స్టెయిన్‌, నవదీప్‌ సైని, యుజ్వెంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌లతో కూడిన విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.


తుది జట్లు (అంచనా)


చెన్నై సూపర్ కింగ్స్‌ :


షేన్‌ వాట్సన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, శామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లా, లుంగి ఎంగిడి.


రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ :


దేవదత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, శివం దూబె, జోశ్‌ ఫిలిప్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, డెల్‌ స్టెయిన్‌, యుజ్వెంద్ర చాహల్‌.


టీమ్ వివరాలు సంక్షిప్తంగా


టీమ్ పేరు : చెన్నై సూపర్‌కింగ్స్‌


కెప్టెన్: ఎంఎస్ ధోని


యజమాని: చెన్నై సూపర్‌కింగ్స్‌ క్రికెట్ లిమిటెడ్


విజేత : 2010, 2011, 2018


రన్నరప్ : 2008, 2012, 2013, 2015, 2019


టీమ్ వివరాలు సంక్షిప్తంగా


టీమ్ పేరు : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్


కెప్టెన్: విరాట్‌ కోహ్లి


యజమాని: రాయల్‌ చాలెంజర్స్‌ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్


విజేత : -


రన్నరప్ : 2009, 2011, 2016

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM