కొన‌సాగుతున్న డాక్ట‌ర్ల ఆందోళ‌న

by సూర్య | Sat, Oct 10, 2020, 02:13 PM

ఆస్ప‌త్రి యాజ‌మాన్యం గ‌త కొన్ని నెల‌లుగా జీతాలు చెల్లించ‌డం లేదంటూ ఢిల్లీలోని హిందూరావ్ ఆస్ప‌త్రి వైద్యులు చేప‌ట్టిన ఆందోళ‌న ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త మూడు రోజులుగా ఆందోళ‌న చేస్తున్నా జీతాల విష‌య‌మై యాజ‌మాన్యం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ఏది రాక‌పోవ‌డంతో ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించే తీరు ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. 


తాము జీతాల గురించి అడిగితే మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఢిల్ ప్ర‌భుత్వం మీద, ఢిల్లీ ప్ర‌భుత్వం ఎంసీడీ మీద నింద‌లు వేస్తూ కాల‌యాప‌న చేస్తున్నార‌ని వైద్యులు ఆరోపించారు. ఎంసీడీ, ఢిల్లీ ప్ర‌భుత్వం మ‌ధ్య రాజకీయ ఫుట్‌బాల్ క్రీడ‌లో తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఆందోళ‌న‌కారులు చెబుతున్నారు.   

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM