ఈ 4 లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త!

by సూర్య | Sat, Oct 10, 2020, 01:37 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వైరస్ లక్షణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా లక్షణాలు ఇవే అని నిర్ధారించే ఛాన్స్ లేదు. అయితే ఈ మహమ్మారి లక్షణాలు మాత్రం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మహమ్మారి బారినపడే అవకాశం ఉంటుంది. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వేధిస్తుంటే తప్పకుండా అనుమానించాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అయితే ఈ లక్షణాలు కంటే ముందే మరికొన్ని ముందస్తు లక్షణాలు కరోనాను సూచిస్తాయని పరిశోధనల్లో తేలింది.


వైరస్ లక్షణాలను తొలుత గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వచ్చే ముందు నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఉంటే కరోనా లక్షణాలు అని అంతా భావించారు. అవి కాకుండా కొంతమంది కరోనా బాధితుల్లో వేరే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తలనొప్పి, వాసన, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయట. ఈ నేపథ్యంలో కరోనా కేవలం శ్వాసకోశ వ్యవస్థ మీదే కాకుండా కొంతమంది బాధితుల్లో నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు.


ఈ సందర్భంగా 4 రకాల నాడీ సమస్యలను గుర్తించారు. ఈ 4 లక్షణాలు కనిపిస్తే.. అప్రమత్తం అవ్వాల్సిందేనని సూచిస్తున్నారు. అన్నాల్స్ ఆఫ్ న్యూరోలజీ అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం కరోనా వైరస్ రోగుల్లో ఎక్కువ మందికి నాడీ సంబంధ లక్షణాలు కనిపిస్తాయని అధ్యయనంలో తేలింది. తలనొప్పి, మైకం, స్ట్రోక్, అప్రమత్తంగా ఉండలేకపోవడం వంటి నాలుగు లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయట. మరికొందరు బాధితుల్లో వాసన, రుచి చూడలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇది కూడా నాడీ సంబంధ సమస్యేనని అధ్యయనంలో వెల్లడించారు.


నార్త్‌వెస్ట్రన్ మెడిసిన్ తమ పరిశోధనలో భాగంగా 19 మంది కరోనా బాధితులను పరీక్షించింది. వీరిలో కరోనాకు సంబంధించిన ప్రధాన లక్షణాల కంటే ముందే నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ స్టడీకి నేతృత్వం వహించిన ఫెయిన్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ న్యూరాలజీ ఫ్రొఫెసర్ ఐగోర్ కోరాల్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు.


సార్స్ కోవ్-2 ఇన్ఫెక్షన్ సోకినవారిలో నాడీ సంబంధ సమస్యలు ఏర్పడుతున్నాయి. జ్వరాలు, దగ్గు, శ్వాసకోశ సమస్యల కంటే ముందే ఈ లక్షణాలు బయటపడుతున్నాయి అని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలే కాకుండా తలనొప్పి, మైకం, స్ట్రోక్, మైకం, నిలకడగా ఉండకపోవడం వంటి లక్షణాలు ఉంటే కరోనా ప్రాథమిక దశలో ఉన్నట్లేనని అది గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాప్రాయం నుంచి తప్పించుకోవచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM