డిబెట్ కు నో చెప్పిన ట్రంప్

by సూర్య | Sat, Oct 10, 2020, 09:14 AM

అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇద్ద‌రు అధ్య‌క్ష అభ్య‌ర్థులు డిబెట్ లో పాల్గొన‌టం ఆన‌వాయితీ. కానీ ఈసారి అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య వచ్చేవారం  జరగాల్సిన రెండో డిబేట్ రద్దయ్యింది. వర్చువల్ ద్వారా తాను చర్చలో పాల్గొనబోనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడంతో డిబేట్‌ను రద్దుచేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబరు 15న ఈ స‌మావేశం జ‌ర‌గాల్సి ఉంది.మూడు స‌మావేశాల్లో ఒక‌టి పూర్తి కాగా, మ‌రోక‌టి ర‌ద్ద‌యింది. దీంతో అక్టోబ‌ర్ 22న చివరి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. 1976నుండి ఈ డిబెట్ సంప్ర‌దాయం అమెరికాలో కొన‌సాగుతోంది. ట్రంప్ కు క‌రోనా సోక‌టంతో అక్టోబ‌ర్ 15న వ‌ర్చువ‌ల్ స‌మావేశాన్ని ఎన్నిక‌ల సంఘం ఏర్పాటు చేసింది. దీన్ని ట్రంప్ ర‌ద్దు చేసుకోవ‌టంపై డెమోక్రాట్స్ మండిప‌డుతున్నారు. చ‌ర్చించే ద‌మ్ములేక పారిపోయార‌ని మండిప‌డ్డారు.క‌రోనా నుండి కోలుకున్న ట్రంప్ శ‌నివారం బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్నారు. వైట్ హౌజ్ వ‌ద్ద జ‌రిగే ఈ స‌మావేశానికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్, మాస్క్ ను త‌ప్ప‌నిస‌రి చేశారు.

Latest News

 
బస్సు ప్రమాద ఘటనపై రవాణా శాఖాధికారుల విచారణ Fri, May 17, 2024, 05:23 PM
చీరాలలో చిరుజల్లులు, సేద తీరుతున్న జనాలు Fri, May 17, 2024, 05:21 PM
వేసవి విజ్ఞాన శిబిరాన్ని వినియోగించుకోవాలి Fri, May 17, 2024, 05:19 PM
అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి Fri, May 17, 2024, 05:16 PM
ఈ నెల 19న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం Fri, May 17, 2024, 05:14 PM