అక్టోబర్ 15 వరకు పద్మనాభస్వామి ఆలయం మూసివేత

by సూర్య | Fri, Oct 09, 2020, 02:28 PM

కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో కరోనా కలకలం రేపింది. ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబితో పాటుగా మొత్తం 12 మందికి కరోనా సోకడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అక్టోబర్ 15 వరకు ఆలయంలో భక్తుల ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తున్నట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రతీషన్ తెలిపారు. ఆలయం మూసివేసిన సమయంలో కేవలం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించమని.. రోజువారి కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతాయని చెప్పారు.


ప్రధాన అర్చకుడికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన స్థానంలో రోజువారి పూజ కార్యక్రమాలను తంత్రీ శరణానెల్లూర్ సతీసన్ నంబూతిరిపాడ్ చూసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 21న పద్మనాభస్వామి ఆలయాన్ని మూసివేశారు. అయితే అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ప్రకటించిన సడలింపుల్లో భాగంగా ఆగస్టు చివర్లో ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక, తాజాగా ఆలయంలో కరోనా కలకలం చోటుచేసుకోవడంతో అక్టోబర్ 15వరకు మూసివేస్తున్నారు.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM