ఐపీఎల్ 2020: హైదరాబాద్- పంజాబ్ జట్ల మధ్య నేడు ఆసక్తికర సమరం

by సూర్య | Thu, Oct 08, 2020, 02:41 PM

నేడు హైదరాబాద్- పంజాబ్ జట్ల మధ్య కీలకపోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్న ఈ రెండు జట్లకు ప్రస్తుతం గెలుపు చాలా అవసరం. ఈ టోర్నీలో ఇప్పటివరకు హైదరాబాద్ 5 మ్యాచులాడి 2 నెగ్గగా, అన్నే మ్యాచులు ఆడిన పంజాబ్ ఒకటి గెలిచింది. రెండు జట్లలో అత్యుత్తమ ఆటగాళ్లకు కొదవలేనప్పటికీ చిన్నచిన్న తప్పులతో మ్యాచులను చేజార్చుకుంటున్నాయి. ఇరుజట్ల బలాబలాలను ఒకసారి చూద్దాం..


హైదరాబాద్ జట్టు ఎక్కువగా టాపార్డర్ పైనే ఆధారపడుతుంది. వార్నర్, విలియమ్సన్ లతో పాటు మనీష్ పాండే ఆ జట్టుకు కీలకం. బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన హార్డ్ హిట్టర్స్ లేకపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. బౌలింగ్ లో భువనేశ్వర్ సేవలను కోల్పోవడం హైదరాబాద్ కు పెద్ద దెబ్బ. రషీద్ ఖాన్, సందీప్ శర్మలు కీలకం కానున్నారు. నటరాజన్ మంచి ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం.


మరోవైపు.. పంజాబ్ పరిస్థితి ఇంకోలా ఉంది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆ జట్టు కెప్టెన్ రాహుల్ జట్టును సమర్ధంగా నడిపించలేకపోతున్నాడు. మయాంక్ అగర్వాల్ కూడా చక్కని ఫామ్ లో ఉన్నాడు. క్రిస్ గేల్ నేటి మ్యాచ్ లో ఆడనుండడం పంజాబ్ కు ప్లస్ పాయింట్. బౌలింగ్ విషయానికి వస్తే.. షమీ, ముజీబుర్, బిష్ణోయ్ లు ఆ జట్టు తురుపుముక్కలు. ఈ ముగ్గురూ చెలరేగితే హైదరాబాద్ బ్యాట్స్ మెన్ కు ఇబ్బందులు తప్పవు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM