బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యల చేయడం మంచి పద్ధతి కాదు : హైకోర్ట్

by సూర్య | Thu, Oct 08, 2020, 02:28 PM

న్యాయవ్యవస్థను ఉద్దేశించి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది. హైకోర్టు వెలువరించిన తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని... బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యల చేయడం మంచి పద్ధతి కాదని చెప్పింది. ఇకనైనా బాధ్యతాయుతంగా మెలగాలని హెచ్చరించింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM