ఈ టాటా కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.70 వేల వరకూ తగ్గింపు

by సూర్య | Thu, Oct 08, 2020, 02:10 PM

ఫెస్టివల్ సీజన్‌కు ముందే టాటా మోటార్స్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ కంపెనీ వాహనాలపై టాటా మోటార్స్ భారీ డిస్కాంట్స్ ప్రకటించింది. అతి తక్కువ ఈఎంఐ సౌకర్యంతో కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. తాము ఆఫర్లను ప్రకటించామని.. వినియోగదారులు వారి బడ్జెట్‌కు అనుగుణంగా కార్లను ఎంపిక చేసుకోవచ్చని టాటా మోటార్స్ తెలిపింది.
టాటా నెక్సాన్: నెక్సాన్ కారుపై రూ. 20,000 వరకు డిస్కౌంట్ అందజేస్తున్నట్టు ప్రకటించింది. 5,999 రూపాయల అతి తక్కువ ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అలాగే ఈ కారులో వినియోగదారులు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందించనున్నట్టు చెప్పింది.
టాటా టిగోర్: టాటా టిగోర్ కారుపై రూ. 33,000 వరకు డిస్కౌంట్ అందజేస్తుంది. 4,111 రూపాయల ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
టాటా టియాగో: బీఎస్6 నార్మ్స్‌కు అనుగుణంగా అటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన న్యూ ఇంజన్‌తో టాటా టియాగో‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ కారుపై రూ. 28,000 వరకు డిస్కౌంట్ అందజేస్తుంది. 3,555 రూపాయల అతి తక్కువ ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
టాటా హారియర్: బీఎస్6 నార్మ్స్‌కు అనుగుణంగా అటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో టాటా హారియర్‌ను అందజేయనున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ఇది విస్తృత సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. కారును కొనుగోలు చేసేవారికి మొత్తంగా రూ. 70,000 వరకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది. 12,339 రూపాయల అతి తక్కువ ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

Latest News

 
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే Fri, May 03, 2024, 06:30 PM
నటనలో ఓనమాలు నేర్చుకుంది విశాఖలోనే Fri, May 03, 2024, 06:30 PM
మైలవరంలో టీడీపీలోకి చేరికలు Fri, May 03, 2024, 06:28 PM
పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయం Fri, May 03, 2024, 06:28 PM
ఎన్నికల బరిలో నిలిచింది వీరే Fri, May 03, 2024, 06:27 PM