బెల్లాన్ని నువ్వులతో కలిపి తీసుకుంటే ?

by సూర్య | Sat, Mar 28, 2020, 11:10 AM

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రాలలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు. సాధారణంగా చెరుకు రసం నుండి బెల్లాన్ని తయారుచేస్తారు. బెల్లంలో అనేక రకములైన ఔషద గుణాలున్నాయి. ప్రతిరోజు కాస్త బెల్లం ముక్క తినడం వల్ల రక్త శుద్ది జరిగి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఫ్రీరాడికల్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. మరి ఇన్ని పోషకాలు ఉన్న బెల్లం మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


1. అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు 100 గ్రాముల బెల్లం తినడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు.
2. వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
3. బెల్లం మంచి ఔషధం. శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. బెల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
4. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కాస్త బెల్లం కలుపుకుని తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.
5. బెల్లాన్ని నువ్వులతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రాంకైటీస్ లాంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు మద్యాహ్నం, రాత్రి భోజనం అయ్యాక కాస్త బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
6. కీళ్ల నొప్పుల భాదితులు రోజూ 50 గ్రాముల బెల్లం చిన్న అల్లం ముక్కని కలిపి తినడం వల్ల ఆ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ప్రతిరోజు తాగే పాలల్లో పంచదార బదులు బెల్లం కలుపుకుని తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM