కరోనా వైరస్‌తో మృత్యువాత పడ్డ ప్రముఖ భారత సంతతి చెఫ్

by సూర్య | Fri, Mar 27, 2020, 12:43 PM

అమెరికాలోని భారత సంతతికి చెందిన ప్రముఖ చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ కరోనా మహమ్మారి కోరలకు చిక్కి మృత్యువాత పడ్డారు. 59 ఏళ్ల చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ న్యూజెర్సీలో బుధవారం కన్నుమూసినట్టు ఆయన కుటుంబం వెల్లడించింది. బోంబే క్యాంటీన్, ఓ పెర్డో సహా ముంబైలోని రెండు రెస్టారెంట్లకు ఆయన సహ యజమానిగా ఉన్నారు. ఇటీవలే ఆయన తన మూడో వెంచర్ బోంబే స్వీట్ షాప్ కూడా ప్రారంభించారు. మార్చి 8 వరకు ముంబైలోనే ఉన్న కార్డోజ్... చివరిసారి ఈ నెల 18న సోషల్ మీడియాలో స్పందించారు. తాను మార్చి 8న వైద్య చికిత్స కోసం తిరిగి అమెరికా వచ్చాననీ.. అయితే కొద్దిగా జ్వరంగా ఉన్నట్టు అనిపించడంతో న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో చేరానని ఆయన పేర్కొన్నారు. అయితే వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. చివరకు ఆయన ఆ మహమ్మారికి బలయ్యారు

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM