ఏపీలో 11కు చేరిన కరోనా కేసులు

by సూర్య | Fri, Mar 27, 2020, 09:24 AM

ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్వీడర్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. మార్చి 18న యువకుడు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చాడు. కరోనా లక్షణాలతో అతను మార్చి 25న విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి వచ్చిన రిపోర్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 11కి చేరింది. గురువారం రాత్రి వైద్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఈ వివరాలు వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు 360 మంది కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. 317 మందికి నెగటివ్ వచ్చింది. 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 32 మంది రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు 104కి కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని సీఎం జగన్ ప్రజలను కోరారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM