ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

by సూర్య | Fri, Mar 27, 2020, 09:35 AM

కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. వారికి ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీని ప్రకటించారు. అందులో భాగంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న చిరుద్యోగులకు వరాలు కురిపించారు. రూ.15,000 లోపు వేతనం ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయర్ షేర్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 100 లోపు ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థలో రూ.15,000 లోపు వేతనంతో పనిచేస్తున్నవారు ఈ నిర్ణయంతో లబ్ధిపొందుతారు. వారికి ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇలా మూడు నెలలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల వేతనం... వీటిలో ఏది తక్కువ అయితే అది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. 4.8 కోట్ల మంది ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

Latest News

 
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM