1.7 లక్షల కోట్లు ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం...

by సూర్య | Thu, Mar 26, 2020, 02:55 PM

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఢిల్లీలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన వారిని ఆదుకునేలా గరీబ్‌ కల్యాణ్‌ పథకం పేరుతో ఈ ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తామని ఆమె చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోన్న ప్యాకేజీతో దేశంలోని 80 కోట్ల మంది పౌరులకు లాభం చేకూరుతుందని చెప్పారు. రానున్న మూడు నెలలకు సరిపడా బియ్యం, గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు తమ అకౌంట్ల నుండి 75% విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM