వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ హైకోర్టు జడ్జీల విచారణ

by సూర్య | Thu, Mar 26, 2020, 02:12 PM

దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు జడ్జీలు ఇంటి నుంచే అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో కజకస్థాన్ దేశంలోని అల్‌మటీ విమానాశ్రయంలో 300 మంది భారత విద్యార్థులు ఆహారం, వైద్య సహాయం లేకుండా అవస్థలు పడుతున్నారని ఢిల్లీ హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషనుపై జస్టిస్ సిద్ధార్థ మృదుల, జస్టిస్ తల్వంత్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వార విచారణ జరిపింది. ఈ కేసులో జడ్జీలు, న్యాయవాదులు ఇంటి నుంచే వీడియో,వాట్సాప్ మల్టీ కాన్ఫరెన్స్ ద్వార అత్యవసర కేసును విచారించారు. ఈ కేసులో భారత విద్యార్థులకు వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీ హైకోర్టు జడ్జీలు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను ఆదేశించారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM