ముంబైలో లాక్‌డౌన్ అమలుకు డ్రోన్లతో నిఘా

by సూర్య | Thu, Mar 26, 2020, 01:47 PM

ముంబై నగరంలో కరోనా వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయడానికి ముంబైలో కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనల అమలును పర్యవేక్షించడానికి పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ముంబై వీధుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు కోరుతూ ప్రచారం చేయడంతో పాటు ఎవరూ బయటకు రాకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇళ్లలోనుంచి బయటకు రాకుండా ఉండటం ఒక్కటే పరిష్కారమని, ఎలాంటి కారణం లేకుండా ఎవరైనా ఇళ్లలోనుంచి బయటకు వస్తే వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM