కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...

by సూర్య | Thu, Mar 26, 2020, 01:48 PM

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రస్తుతం రోడ్ల పై అత్యవసర వాహనాలు మినహా ఏ వాహనాలు కూడా తిరగడం లేదు. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో టోల్ గేట్ ఫీజును ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకు టోల్ గేట్ ఫీజు ఎత్తివేస్తునట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేటి నుంచి ఏప్రిల్ 14 వరకు టోల్ గేట్ ఫీజు వసూలు చేయరన్నారు. తాత్కాలికంగా ఫీజును ఎత్తివేస్తున్నామన్నారు. ఎక్కడైనా టోల్ సిబ్బంది ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM