లాక్‌డౌన్‌ ప్రకటించిన ఛత్తీస్‌గఢ్‌

by సూర్య | Mon, Mar 23, 2020, 10:48 AM

 ఛత్తీస్‌గఢ్‌లోని పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఆయా ప్రాంతాల్లో మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నట్లు ప్రకటించింది. దీంతో అత్యవసర సేవల విభాగాలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. 500 మందికి చికిత్స చేసే సౌకర్యాలను అదేవిధంగా మరో 1500 మందిని క్వారంటైన్‌లో ఉంచే సామర్థ్యాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, బిహార్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రం 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించింది.

Latest News

 
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM
ఊరవతల మామిడితోటలోని గదిపై అనుమానం.. వెళ్లి తలుపులు తెరిస్తే.. పోలీసులే షాక్ Sun, Apr 28, 2024, 08:47 PM