మోర్గాన్‌ మెరుపులు

by సూర్య | Mon, Feb 17, 2020, 02:26 PM

కొండంత లక్ష్యం కళ్ల ముందు ఉన్నా ఇంగ్లండ్‌ జట్టు అదరలేదు... బెదరలేదు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో (22 బంతుల్లో 57 నాటౌట్‌; 7 సిక్స్‌లు)... దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (33 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), బవుమా (24 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), డికాక్‌ (24 బంతుల్లో 35; ఫోర్, 4 సిక్స్‌లు), మిల్లర్‌ (20 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (7; సిక్స్‌) విఫలమైనా... జోస్‌ బట్లర్‌ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్‌ స్టో (64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుటైనా... మోర్గాన్‌ మిగతా పనిని పూర్తి చేశాడు. మోర్గాన్‌ ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు ఉండటం విశేషం. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన మోర్గాన్‌... గతంలో తన పేరిటే ఉన్న ఇంగ్లండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ ఫిప్టీ రికార్డును సమం చేశాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా మోర్గాన్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో రెండు నెలల దక్షిణాఫ్రికా పర్యటనను ఇంగ్లండ్‌ ఘనంగా ముగించింది. టెస్టు సిరీస్‌ను 3–1తో, టి20 సిరీస్‌ను 2–1తో గెల్చుకున్న ఇంగ్లండ్‌... వన్డే సిరీస్‌ను 1–1తో సమం చేసుకుంది.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM