సీఏఏపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: మోడీ

by సూర్య | Sun, Feb 16, 2020, 07:42 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు వారణాసి-చౌందౌలి సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ మెమెరియల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టంపై తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 370 అధికరణ రద్దు, సీఏఏపై తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని, ఆ ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నేడు తన సొంత నియోజకవర్గమైన వారణాసి నియోజకవర్గం పర్యటనలో భాగంగా రూ.1,200 కోట్ల విలువచేసే 36 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. మరో 14 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే దేశంలోని తొలి ఓవర్‌నైట్ ప్రైవేట్ ట్రైన్ 'కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌'ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM