భూమిని కొనుగోలు చేసేటప్పుడు ఇవి తెలుసుకోండి..

by సూర్య | Sat, Feb 15, 2020, 01:29 PM

భూమి కొనుగోలు చేసేటప్పుడు అన్ని అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఇళ్లు ఏది కొనుగోలు చేయాలనుకున్నా అది కొనుగోలు జాబితాలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా చూసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ శాఖ సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన నిషేధిత జాబితా ఉంటుంది. ప్రభుత్వ, అసైన్‌మెంట్‌, ఎండోమెంట్‌ భూములు, కోర్టు వివాదంలో ఉన్న భూముల వివరాలన్నీ అందులో ఉంటాయి. గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఈ వెబ్‌సైట్ల వివరాలన్నీ లభిస్తాయి. వ్యవసాయ భూమి కొనేముందు అమ్మేవారికి టైటిల్‌ ఉందా.. లేదా.. అనేది చూడాలి. రెవెన్యూ శాఖకు చెందిన ధరణి వెబ్‌సైట్‌లోనూ గ్రామం, సర్వే నెంబరులో వారి పేరు ఉందా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో సర్వే నెంబరులో పేరున్నపటికీ డీఎస్‌ పెండింగ్‌ అని ఉంటుంది. అలాంటి భూమిని తహసీల్దార్‌ సంతకం పెట్టే వరకు కొనొద్దు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోతే కొనకుండా ఉండటమే మంచిది. గతంలోనే భూమి రిజిస్టరై ఉంటే రిజిస్ట్రేషన్‌ నెంబరు సాయంతో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) తీసుకొని వివరాలను సరిచూసుకోవాలి.
పట్టణాల్లో ఓపెన్‌ ప్లాట్లు కొనాలనుకుంటే కార్పొరేషన్‌, మున్సిపల్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల అనుమతి (లేఅవుట్‌) ఉందా, లేదా చూసుకోవాలి. హెచ్‌ఎండీఏ పరిధిలో కానీ, హైదరాబాద్‌ చుట్టుపక్కల దాదాపు 70-80 శాతం లేఅవుట్లకు అనుమతులు లేవు. కానీ జనాలు కొంటున్నారు. వాటితో భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. అందుకే మున్సిపాలిటీల పరిధిలో ఖాళీ స్థలం పన్ను అంచనా నంబరు(వీఎల్‌టీఏ) ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయమని రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాలిచ్చింది. ఈవిషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలి. ఆ వీఎల్‌టీఏలో మనకు విక్రయించే వారి పేరుంటేనే సరైన వాళ్లని అర్థం. అది లేని పక్షంలో ఎల్‌ఆర్‌ఎస్‌ అయినా ఉందా, ఉంటే అది సరైనదేనా అనేది చూసుకోవాలి. జనవరి 1, 2017 తరువాత 500 గజాలకు పై బడిన స్థలంలో కొనుగోలు చేసే ప్లాట్లకు రెరా అనుమతి తప్పనిసరి. నగరం, పట్టణాల్లో ఇళ్లు కొనేవారు వీటన్నింటిని సరిచూసుకుంటే మంచిది.
కొత్తగా నిర్మించే నివాస, వ్యాపార భవనం ఏదైనా సరే సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. రాష్ట్రంలో ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ, డిస్ర్టిక్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌లు, స్థానిక మునిసిపాలిటీల నుంచి అనుమతుల తీసుకోవాలి. ప్రస్తుతం నిర్మాణ అనుమతులన్నీ ఆన్‌లైన్‌(డీపీఎంఎ్‌స)లోనే జారీ చేస్తున్నారు. ఒక నిర్మాణానికి సంబంధించిన అనుమతి కోసం ఆయా ప్రాంతానికి చెందిన సంస్థ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరి భూమి కొనుగోలు చేసే ముందు ఈ పత్రాలు ఉన్నాయో లేవో చూసుకోండి.
స్థల యాజమాన్య హక్కు పత్రం.
రిజిస్టర్‌ సేల్‌ డీడ్‌
పట్టాదార్‌ పాసు బక్కు లేదా రెవెన్యూ శాఖ జారీ చేసిన టైటిల్‌ డీడ్‌
తాజా ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ జనవరి 1, 1983 నుంచి ఇప్పటి వరకు.
డిక్లరేషన్‌ కమ్‌ అండర్‌టేకింగ్‌ ఫామ్స్‌పై యజమాని సంతకం.
దరఖాస్తు దారుని గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు/పా్‌సపోర్టు/డ్రైవింగ్‌ లైసెన్సు/వోటర్‌ ఐడీ/ పాన్‌ కార్డు/బ్యాంకు పాసు బుక్కు)
ఆర్కిటెక్చర్‌, సర్వేయర్‌, ఇంజనీర్‌కు సంబంధించిన లైసెన్సుతో ఉన్న పత్రం.
ఇంటి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్‌ పత్రాలు వివరంగా, అంతస్థుల వారిగా సమర్పించాలి.
ఇంటి నిర్మాణం చేపట్టే ప్రాంతానికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ లేదా బేస్‌ మ్యాప్‌ను జత చేయాలి.
స్థలానికి సంబంధించిన తాజా ఫోటోలు, చుట్టు పక్కల ప్రాంతాలు.
లోకేషన్‌ ప్లాన్‌/ టోపో ప్లాన్‌ డ్రాయింగ్‌
ఆర్కిటెక్చర్‌ నియమించుకున్నట్లుగా స్వయంగా ధృవీకరించిన పత్రం.
భూ కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు ప్లాట్ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యం. మీకు ఏదైనా నిర్దిష్ట ప్లాట్ ప్రాజెక్ట్ ఉంటే, దాని ఆధారంగా భూమిని అంచనా వేయండి. మీరు పైన పేర్కొన్న అంశాలను జాగ్రత్తగా చూసుకున్న తర్వాత, మీరు అమ్మకానికి ఉన్న భూమి కొనుగోలుకు లేదా అమ్మకానికి సంబంధించి ఒక నమ్మకం అనేది వస్తుంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM