చిన్న వయస్సులోనే ఆరోగ్య బీమా ఎందుకు తీసుకోవాలి?

by సూర్య | Wed, Feb 12, 2020, 07:57 PM

అవసరాలను బట్టి కుటుంబ సభ్యులందరి కోసం ఆరోగ్య బీమా తప్పకుండా తీసుకోవాలి. ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం ద్వారా అకస్మాత్తుగా లేదా అనుకోని విధంగా ఆసుపత్రిలో చేరితే దాని ఖర్చుల నుండి మనల్ని బీమా రక్షిస్తుంది. లేక పోతే ఇంట్లో దాచుకున్న డబ్బులు ఖర్చయిపోయి అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. పరీక్షలు కూడా ఖరీదుగా ఉంటాయి. బీమా తీసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. హెచ్చరికలు లేకుండా వైద్య సంబంధిత అత్యవసర పరిస్థితి మనలో ఎవరినైనా దెబ్బతీయవచ్చును. సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి, కొత్త ప్రక్రియలు మరియు మరింత ప్రభావం కలిగిన మందులు, వీటన్నిటి ఖరీదు పెరగడంతో ఆరోగ్య సంరక్షణ కూడా రోజు రోజుకి మితిమీరి ఆర్ధిక పరంగా భారమయి పోతున్నది. ఈ అధిక ఖర్చుతో కూడిన చికిత్స్ చాలా మంది మనుషులకు భరించలేనిది, అయితే, ఆరోగ్య బీమా అనే భద్రతను కల్పించుకోవడం చాలా మందికి వీలయ్యే పని. నేటి కాలం ఆరోగ్య సమస్యలను చూస్తుంటే.. సాధారణ కుటుంబ ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే చాలదు. కేన్సర్‌, అవయవాల మార్పిడి, గుండె జబ్బులు, శ్వాసకోస జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషుల ఆరో గ్యంతోపాటు ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయి. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా కవర్‌ అయ్యేలా ముందుగానే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బీమా పాలసీ తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో కేన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా కేన్సర్‌ సోకిన చరిత్ర ఉంటే ప్రత్యేకంగా కేన్సర్‌ పాలసీ తీసుకోవడం మంచిది. ఈ పాలసీ ద్వారా అన్ని రకాల కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు, కీమోథెరపీ, రేడియేషన్‌, హాస్పిటలైజేషన్‌ వంటి ఖర్చులకు బీమా రక్షణ లభిస్తుంది. కంపెనీలు అందించే ఆరోగ్య పాలసీల్లో ఉండే కో-పే (సహ చెల్లింపు) క్లాజు, గది అద్దె క్లాజులతో పాలసీదారుడిపైనా ఆర్థిక భారం పడుతుంది. అంటే హాస్పిటల్‌ ఖర్చులు, గది అద్దె కంపెనీ నిర్ణీత మొత్తాన్ని మాత్రమే భరిస్తుంది. మిగతా మొత్తాన్ని పాలసీదారుడు (ఉద్యోగి) భరించాలి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులు అందరికి వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవడం మంచిది. హాస్పిటల్‌ ఖర్చులు ఏటా పెరిగిపోతున్నాయి. బీమా ఉన్నా ఒక్కోసారి హాస్పిటల్‌ ఖర్చులు, ఆ పాలసీ కవరేజీ దాటి పోవచ్చు. టాప్‌అప్‌ ప్లాన్స్‌ ద్వారా ఈ ఖర్చుల నుంచి బయటపడొచ్చు. అంటే బీమా పాలసీల టాప్‌అప్స్‌ ద్వారా పెరుగుతున్న హాస్పిటల్‌ ఖర్చులనూ తట్టుకోవచ్చు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM