చైనాలో 42వేలు దాటిన కరోనా కేసులు

by సూర్య | Tue, Feb 11, 2020, 04:41 PM

చైనాలో రోజురోజూకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు చైనా మొత్తం మీద కరోనా వైరస్ కేసులు 42,638 నమోదైనట్టు తెలుస్తోంది. కాగా సోమవారం ఒక్క రోజే 108 మంది మృతిచెందినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఇదిలావుంటే.. చైనాలో వందలమంది ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి మరణించారు. భారత్ పాటు మరో 20 దేశాలకు కరోనా వైరస్ విస్తరిస్తోంది. అయితే చైనాలో కరోనా వైరస్ బాధితులు ఎంతమంది?, ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్న లెక్కలపై స్పష్టత కొరవడింది.


ఇటు చైనా ప్రభుత్వం గానీ, అధికార యంత్రాంగం గానీ ఈ లెక్కలపై స్పష్టతనివ్వట్లేదు. అధికారికంగా చైనాలో 42,638 కేసులు నమోదైనట్టు అక్కడి హెల్త్ కమిషన్ చెప్పినట్టు ఏఎన్ఐ ట్విట్టర్లో పేర్కొంది. కానీ వాస్తవానికి ఈ కేసుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంటుందని పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం వల్ల చైనాలో స్థానికంగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిమంది ప్రజలు ఇళ్లల్లో బందీలు మారినట్టు నెట్టింట్లో సైతం వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.


కరోనా వైరస్‌పై చైనా ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన లెక్కలను అధికారికంగా చెప్పట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలు రంగాల్లో కార్యకలాపాలు స్థంభించిపోయాయి. అత్యంత త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండడంతో చైనాలో విద్యాసంస్థలతో పాటు ఆయా సంస్థలు సెలవులను ప్రకటించాయి. దీనికితోడు చైనాకు సమీపంలోని దేశాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగం ఇప్పటికే నెమ్మదించింది. ఆయా దేశాలు చైనాకు వెళ్లిన పర్యాటకులను తమ దేశాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి.చైనాలో కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 1016 మంది మృతి చెందారు. తాజాగా చైనాలో సోమవారం ఒక్క రోజే 108 మంది మరణించగా, మరో 2478 కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ తన నివేదికలో తెలిపింది. కరోనా వైరస్ వల్ల మరణించిన వారిలో హుబే ప్రావిన్స్ నగరానికి చెందిన వారు 103 మంది ఉండగా, బీజింగ్, టియాంజిన్, హీలాంగ్జియాంగ్, అన్హుయి, హెనన్ నగరాల్లో ఒక్కొక్కరు ఉన్నట్టు అక్కడి ప్రభుత్వ వార్త సంస్థ తెలిపింది.


ఇదిలావుంటే.. కరోనా వైరస్ సోకిన రోగులు వ్యాధి నయం కావడంతో సోమవారం వరకు 3,996 మంది ఆయా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్టు నివేదికలో పేర్కొంది. సెంట్రల్ ఫ్రావిన్సు నగరంలో 2097 కొత్త కేసులు నమోదైనట్టు హుబే ఆరోగ్య కమిషన్ సైతం తెలిపింది.

Latest News

 
బీజేపీ నుండి ఏమీ హామీ పొందారో చంద్రబాబు చెప్పాలి Sat, Apr 27, 2024, 02:10 PM
పేదవాడు అభివృధ్దిచెందినా కూడా టిడిపి చూడలేకపోతోంది Sat, Apr 27, 2024, 02:09 PM
నామీద విమర్శలు ఏంటి? Sat, Apr 27, 2024, 02:09 PM
చంద్రబాబు, పవన్ లపై ఈసీకి పిర్యాదు Sat, Apr 27, 2024, 02:08 PM
దళిత యువకుడిపై దాడి అమానుషం Sat, Apr 27, 2024, 02:07 PM