పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం కీలక నిర్ణయం

by సూర్య | Mon, Feb 10, 2020, 06:08 PM

పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి చేయాలని గడువు ఉంది. తాజాగా ఆ గడువును పెంచుతూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి విధించిన గడువును 2021 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. రాజ్యసభలో ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర సర్కార్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటి సెంటర్,వాటర్ కమిషన్ ప్రతిపాదనల మేరకు కేంద్రం ఇప్పటి వరకు రూ.8614 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది.
2018- 19లో ప్రాజెక్టు కోసం రూ.3047 కోట్లు ఖర్చు చేశారని, అందులో కేంద్రం రూ.1400 కోట్ల నిధులు రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల పై ఆడిట్ జరగకుండా మరిన్ని నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
ఏదేమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి శుభవార్తగా చెప్పవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. తాజాగా కేంద్రం కూడా అప్పటి వరకు గడువు విధించడంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు పొందేందుకు ఏపీ సర్కార్ కు అవకాశం దొరికినట్టయ్యిందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM