నా కూతురి మరణాన్ని రాజకీయం చేయవద్దు : నిర్భయ తల్లి

by సూర్య | Fri, Jan 17, 2020, 06:27 PM

తన కూతురి మరణాన్ని అపహాస్యం చేయవద్దని కన్నీళ్లతో రాజకీయ పార్టీలను వేడుకుంటున్నానని నిర్భయ తల్లి ఆషాదేవి అన్నారు. నా కూతురిని చంపిన వారికి వేలకొద్దీ అవకాశాలు లభిస్తున్నాయి. కానీ మాకు ఏ హక్కులు లేవా అని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో నేను ఇంతవరకు రాజకీయాల గురించి ఒక్కసారి కూడా మట్లాడలేదు. అయితే ఒక్క విషయం..2012లో ఎవరైతే నా కూతురి కోసం వీధుల్లోకి నిరసనలు చేశారో..ఈ రోజు వాళ్లే నా కూతురి చావును అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014లో అధికారంలో వస్తే మహిళలపై దాడులు జరగవని చెప్పారు. రెండోసారి కూడా అధికారం చేపట్టి వేల కొద్దీ పనులు చేశారు. ట్రిపుల్‌ తలాక వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నా కూతురి విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకొవాలని బిజెపి ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర వెూడీకి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇక నిర్భయ అత్యాచార నిందితుల్లో ఒకడైన ముఖేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిర్ణయం తీసుకున్నారు.

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM
ఊరవతల మామిడితోటలోని గదిపై అనుమానం.. వెళ్లి తలుపులు తెరిస్తే.. పోలీసులే షాక్ Sun, Apr 28, 2024, 08:47 PM
పిఠాపురం: నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..? వైసీపీ గూటికి వర్మ Sun, Apr 28, 2024, 08:03 PM