మిస్టరీగా మారిన భారత యువతి మరణం

by సూర్య | Fri, Jan 17, 2020, 05:15 PM

2019 డిసెంబర్ 30న అమెరికాలో అదృశ్యమైన సురీల్ దాబావాలా అనే యువతి శవమై తేలింది. సురీల్ సొంత కారులో బ్లాంకెట్ లో చుట్టబడిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న సురీల్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఎంతో ప్రేమగా చూసుకున్న తమ కూతురు ఇలా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం చూసి గుండెలు పగిలేలా రోదించారు.


గుజరాత్ కు చెందిన అషరాఫ్ దాబావాలా ఇల్లినాయిస్ లోని ఛౌంబర్గ్ లో ఫిజీషియన్ గా పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో అషరాఫ్ దాబావాలకు ఫిజిషియన్ గా మంచి గౌరవం ఉంది. అతని కూతురే సురీల్ దాబావాలా. కుటుంబసభ్యులు ప్రేమగా, మర్యాదగా ఉంటారని ఆ ప్రాంతంలోని భారతీయులు చెబుతున్నారు. సురీల్ దాబావాలా చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ చదవుతుంది. డిసెంబర్ 30న సురీలో కనిపించకుండా పోయింది. కూతురు సురీల్ కనిపించకపోవడంతో తండ్రి అషరాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే సురీల్ జాడ చెప్పిన వారికి 10 వేల డార్లు బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు.


దాదాపు రెండు వారాల తర్వాత సురీల్ మృతదేహం చికాగోలో లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో బయటపడిన సురీల్ మృతదేహంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సురీల్ కారు డిక్కీలో దుప్పటిలో చుట్టిన ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ తెలిపింది. సురీల్ కుటుంబం విజ్ఞప్తి మేరకు సురీల్ జాడను కనుగొన్నట్లు వెల్లడించింది. కాగా సురీల్ మరణానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. టాక్సీకాలజీ నివేదకలు వస్తే మరణానికి కారణాలు తెలిసే ఛాన్స్ ఉంది. అందుకు దాదాపు నెల రోజులు పట్టే అవకాశం ఉంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM