రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలపై సీఎంకు వివరించాం : మంత్రి బొత్స

by సూర్య | Fri, Jan 17, 2020, 04:52 PM

అమరావతి : జియన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలపై హై పవర్ కమిటీలో  చర్చించిన అంశాలను సీఎం కు వివరించాం.మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ  ..వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిపై ఇరు కమిటీలు ఇచ్చిన నివేధికలపై సీఎం కు వివరించాం.రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలపై సీఎంకు వివరించాం.రైతులకు గతంలో చేసిన ఒప్పందాలతో పాటు మరింత మేలు చేసేలా ఉండాలని సీఎం చెప్పారు.రైతుల అభ్యంతరాల తీసుకోవడం సాంకేతిక లోపం ఉందనడంలో వాస్తవం లేదు.


రైతులతో చర్చిండానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.రాజదాని గ్రామాల రైతులు కొందరు  న్యాయం చెయ్యమని కోరారు.చెన్నై ఐఐటీ ఎటువంటి ఇవ్వలేదని కొన్ని పత్రికలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయి.ఐఐటీ ఇచ్చిన నివేదికపై మా ఆధారాలు ఉన్నాయి.బిసిజి రిపోర్ట్ లో సైతం అక్కడి వాస్తవ పరిస్థితులను నివేదికలో చెప్పింది.చంద్రబాబు చెప్పినట్లు అది శాశ్వత సచివాలయం అయితే నేను తల దించుకుంటా.వెలగపూడిలో నిర్మించింది శాశ్వత సచివాలయం అయితే మరి నెలపాడు వద్ద మరో సచివాలయానికి ఎందుకు శంకుస్థాపన  చేశారు.


25 శాతం నిర్మాణాలు జరిగిన ప్రతి భవనాన్ని పూర్తి చేస్తాం.రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటాం.13 జిల్లాల అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధి కూడా జరుగుతుంది.రైతులను ఆందోళనలు చేయొద్దని చెప్తున్నాం. రాజధాని కోసం కలెక్ట్ చేసిన నిధులు ఏమైయ్యాయి,ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోలీ పట్టిన ఫండ్స్ ఎవరికి ఇచ్చారు.


రాజదానిపై పవన్ ఇప్పడు జ్ఞానోదయం అయిందా.ప్రతి పక్షం,విపక్షం  ఎవరితో కలిసిన  మాకు అభ్యంతరం లేదు.రాజదానిపై మాకు పూర్తి స్పష్టత  ఉంది.అమరావతిని రాజధానిగా చెప్పిన చంద్రబాబు 5 ఏళ్ళలో ఎందుకు గెజిట్ ఇవ్వలేదు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM