ప్రజా వేదికలాగా రాజధాని భవనాలను కూడా కూల్చేస్తారా?: లోకేశ్

by సూర్య | Fri, Jan 17, 2020, 01:47 PM

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. 'సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి, రాజభవన్‌, హైకోర్టు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, హెచ్‌వోడీ భవనాలు, ఇలా పరిపాలనకు కావాల్సిన సమస్తం ఆధునిక సౌకర్యాలతో ఇప్పటికే రూపుదిద్దుకున్నాయని,  'గత మూడేళ్లుగా, పరిపాలన అంతా ఇక్కడ నుంచే సాగుతోంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా, పరిపాలన ఇక్కడ నుంచి కొనసాగించవచ్చు. అన్నీ అమరిన తర్వాత ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏముంది?' అని 'రాజధాని మారితే ఈ భవనాలను ఏం చేస్తారు ? వీటిని కూడా ప్రజా వేదిక లాగా కూల్చేస్తారా ? ఉన్నవి పీకేసి, కొత్త వాటి కోసం అదనంగా ఖర్చు చెయ్యటం, తుగ్లక్ నిర్ణయం కాదా?'అని ప్రశ్నిస్తూ లోకేశ్ ట్వీట్లు చేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM