బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్..రూ.10 వేల లోపే

by సూర్య | Thu, Jan 16, 2020, 08:07 PM

1. Realme 5s: రియల్‌మీ 5 సిరీస్‌లో వచ్చిన స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 5ఎస్. గతంలోనే రిలీజ్ అయిన రియల్‌మీ 5 మోడల్‌లో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీలో ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తాయి. రియల్‌మీ 5 మోడల్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, రియల్‌మీ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్.


2. Realme 5s: రియల్‌మీ 5ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాలు డిస్‌ప్లే ఉంది. రియల్‌మీ 5ఎస్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్.


3. Realme 5s: రియల్‌మీ 5ఎస్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై + కలర్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్, క్రిస్టల్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999.


4. Redmi Note 7 Pro: గతేడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ప్రో. ఈ ఏడాది కూడా బెస్ట్ స్మార్ట్‌ఫోన్లల్లో ఒకటి. ఇటీవల రెడ్‌మీ నోట్ 7 ప్రో ధర భారీగా తగ్గింది. రూ.10,000 లోపే లభించడం విశేషం. రెడ్‌మీ నోట్ 7 ప్రో ఆకట్టుకోవడానికి కారణం స్పెసిఫికేషన్సే. ఫేస్ అన్‌లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి.


5. Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 48+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా ఉండగా, ఫ్రంట్‌లో 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరాలున్నాయి.


6. Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నెబ్యులా రెడ్, నెప్‌ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్ ఆస్ట్రో మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 7 ప్రో 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999.


7. Redmi Note 8: రూ.9,999 ధరకే షావోమీ రిలీజ్ చేసిన 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 8. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం.


8. Redmi Note 8: రెడ్‌మీ నోట్ 8 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ నోట్ 8 రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్.


9. Redmi Note 8: రెడ్‌మీ నోట్ 8 బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. ఫోన్‌తో పాటు 18వాట్ ఛార్జర్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, కాస్మిక్ పర్పుల్, మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.


10. Lenovo K10 Note: ఇటీవల లెనోవో కూడా కే10 నోట్ స్మార్ట్‌ఫోన్‌తో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ రేస్‌లో అడుగుపెట్టింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM