రాయల్ ఎన్ ఫీల్డ్ లేడి పోలీస్...

by సూర్య | Thu, Jan 16, 2020, 02:09 PM

కర్ణాటకలోని బెంగళూరు పోలీసులు ‘వియ్‌ ఫర్‌ ఉమెన్‌’ పేరుతో మహిళా పోలీసులతో బైక్‌ రైడింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సమాజంలో మగవారి ఆధిపత్యాన్ని, జెండర్‌ బేధాలను తొలగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నగర డీసీపీ దివ్య సారా థామస్ మాట్లాడుతూ.. బెంగళూరు నగరం మహిళలకు సురక్షితమే అని ఈ పోలీసుల బృందం ద్వారా స్త్రీలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ బృందంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు 15 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. వారికి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లపై రెండు దశల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం వారు బెంగళూరు నగర వీధుల్లో గస్తీ తిరుగుతారని తెలిపారు


 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM