తొలి వన్డేలో ఇండియా 255 ఆలౌట్...

by సూర్య | Tue, Jan 14, 2020, 05:55 PM

వాంఖెడే మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 49.1 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఇండియా 255 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(91 బంతుల్లో 74: 9 ఫోర్లు, 1 సిక్స్‌), లోకేష్‌ రాహుల్‌(61 బంతుల్లో 47: 4 ఫోర్లు) మినహా మిగితా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఒకానొక దశలో 27 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 133 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇండియా.. రాహుల్‌ ఔటవడంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒక్కసారిగా తడబడింది. రెండో వికెట్‌కు వీరిద్దరూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లి(16) 1 సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చాడు. తదుపరి బంతికే షాట్‌ ఆడబోయి బౌలర్‌ ఆడమ్‌ జంపాకే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయాస్‌ అయ్యర్‌(4 పరుగులు) విఫలమయ్యాడు. రిషభ్‌ పంత్‌(28), జడేజా(25) కాసేపు వికెట్లను అడ్డుకున్నారు. కానీ భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3 వికెట్లు, కమిన్స్‌ 2, రిచర్డ్‌సన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా, ఆస్టన్‌ ఆగర్‌ చెరో వికెట్‌ తీశారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM