మళ్లీ ఆర్టికల్ 370 తీసుకురాగలరా?

by సూర్య | Mon, Oct 14, 2019, 08:42 PM

హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్టికల్ 370 రద్దు ఓ విప్లవాత్మక నిర్ణయం అని, అయితే దానిపై కాంగ్రెస్ ఇంతవరకు తన వైఖరిని వెల్లడించలేదని అన్నారు. కశ్మీర్ పై కాంగ్రెస్ పార్టీవి మొసలి కన్నీళ్లని వ్యాఖ్యానించారు. హర్యానాలోని బల్లాభ్ గఢ్ లో ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ను చీల్చి చెండాడారు. "మీరు అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370 తీసుకురాగలరా? మీకా దమ్ముందా? కనీసం మేనిఫెస్టోలో అయినా ఆర్టికల్ 370 అంశాన్ని పెట్టగలరా?" అంటూ సవాల్ విసిరారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విదేశాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోందని మోదీ ఈ సందర్భంగా ఆరోపించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాద్ధాంతం చేశారని, ఎంతో ఉపయుక్తమైన ఆ ఒప్పందాన్ని రద్దు చేయడానికి సర్వశక్తులూ ఒడ్డారని వ్యాఖ్యానించారు. కానీ, ఇలాంటి వాళ్ల ప్రయత్నాలన్నీ వీగిపోయాయని, తొలి రాఫెల్ విజయవంతంగా మన చేతికి అందిందని మోదీ పేర్కొన్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM