గాంధేయమార్గమే నేటి ప్రపంచానికి అవసరం

by సూర్య | Mon, Oct 14, 2019, 06:25 PM

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం కింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో అక్టోబర్‌ 11 నుంచి 13వరకు మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) సహకారాన్ని అందించాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వక్తలు ప్రసంగిస్తూ అణు యుద్ధం అంచున ఉన్న ప్రపంచానికి గాంధేయ మార్గమే శరణ్యమని చెప్పారు. గాంధీజీ సిద్ధాంతాలను బలమైన అస్త్రాలుగా నిర్వచించి, అహింసా శక్తిని ప్రపంచానికి మార్టిన్‌ లూదర్‌కింగ్‌ చాటి చెప్పారని వక్తలు తెలిపారు. ఈ సదస్సులో మహాత్మాగాంధీ మనవరాలు ఇలా గాంధీ, మనవడు రాజమోహన్‌గాంధీ, మార్టిన్‌ లూదర్‌ కింగ్‌-3, ఆంథోనీ చావేజ్‌, జోనాథన్‌ గ్రనెఫ్‌, భారత కాన్స్‌లేట్‌ జనరల్‌ సంజయ్‌ పాండే, ఏపీ మాజీ సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. కింగ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరక్టర్‌ బార్న్‌కార్టన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ?సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సదస్సులలో పలువురు నిష్ణాతులు పాల్గొని ప్రసంగించారు. ఉమెన్‌ ఇన్‌ మూవ్‌మెంట్‌ ప్యానల్‌లో డా. మేరికింగ్‌, డా. శారద శొంఠి, డా. వీణహొవార్డ్‌, డా. షెల్లి జ్యోతి పాల్గొన్నారు. తెలంగాణ టూరిజం సెక్రటరీ వెంకటేశం బుర్రా, జయప్రకాష్‌ వల్లూరు, ప్రసాద్‌ తోటకూర, గౌతమ్‌ మెహ్రా, అమీషా మెహతా, పద్మావతి వెంపటి, బన్నిభూల తదితరులు కూడా సదస్సులో పాల్గొన్నవారిలో ఉన్నారు.
ఈ కాన్ఫరెన్స్‌కు కన్వీనర్‌గా వ్యవహరించిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ నార్తర్న్‌ కాలిఫోర్నియా మాజీ అధ్యక్షుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం?మాజీ అధ్యక్షుడు జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారన్నారు. ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.  కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ తానా మాజీ అధ్యక్షుడు డా. రాఘవేంద్ర ప్రసాద్‌, కాన్ఫరెన్స్‌ కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌ గొల్లనపల్లి తదితరులు కూడా ఈ సదస్సును విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా తరపున వెంకట్‌ కోగంటి, రజనీ కాకర్ల, భక్త బల్లా, సతీష్‌ వేమూరి, మురళీ వెన్నం, భరత్‌ ముప్పిరాల, రామ్‌ తోట, బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ తరపున విజయ ఆసూరి, ప్రసాద్‌ మంగిన, యశ్వంత్‌, రమేష్‌ కొండ తదితరులు పాల్గొన్నారు.


 

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM