బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ

by సూర్య | Mon, Oct 14, 2019, 03:44 PM

ముంబయి: బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ నామినేషన్‌ వేశారు. ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్‌ షా, ఎన్‌ శ్రీనివాసన్‌, ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ఉన్నారు. గంగూలీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. కోశాధికారిగా అనురాగ్‌ ఠాకూర్‌ తమ్ముడు అరుణ్‌ ధూమల్‌ నామినేషన్‌ వేశారు. అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు నేటితో ఆఖరి తేదీ. ఇప్పటివరకు అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నిక ఇక లాంఛనప్రాయమే అవనుంది. తొలుత అధ్యక్ష పదవికి శ్రీనివాసన్‌ సన్నిహితుడు బ్రిజేష్‌ పటేల్‌ నుంచి గట్టి పోటీ వచ్చినప్పటికీ.. ఆదివారం జరిగిన అనధికారిక సమావేశంలో అనేక రాష్ట్రాల సంఘాల ప్రతినిధులు గంగూలీకే మద్దతు పలికినట్లు తెలిసింది.


 


 


 

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM