అమ్మకు ఫ్రిజ్ కొనివ్వాలి.. 35 కిలోల నాణాలు తీసుకుంటారా..?

by సూర్య | Sun, Oct 13, 2019, 02:22 PM

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల సహారన్ నివాసి, 17 ఏళ్ల రామ్‌సింగ్ ఉదయాన్నే న్యూస్‌పేపర్‌లో ఒక ఫ్రిజ్ ప్రకటన చూసి, షోరూంనకు ఫోన్ చేశాడు. తన తల్లి పప్పూదేవి పుట్టినరోజు సంద్భంగా ఫ్రిజ్ కొనివ్వాలనుకుంటున్నానని, అయితే తన దగ్గర నాణాలు మాత్రమే ఉన్నాయని, వాటిని తీసుకుని ఫ్రిజ్ ఇస్తారా? అని అడిగాడు. దానికి షోరూం యజమాని సమ్మతించాడు. దీంతో రామ్‌సింగ్ ఒక సంచీలో సుమారు 35 కిలోల బరువున్న నాణాలను తీసుకుని దుకాణానికి వెళ్లాడు. వాటిలో రూపాయి, రెండు, ఐదు, పది రూపాయల నాణాలున్నాయి. ఆ నాణాలను లెక్కించగా అవి ఫ్రిజ్ ఖరీదు కన్నా రెండు వేల రూపాయలు తక్కువగా ఉన్నాయి. అయితే షోరూం యజమాని ఆ కుర్రాడికి తల్లిపై ఉన్న ప్రేమను గ్రహించి, ఆ ఫ్రిజ్‌ను రెండు వేల రూపాయల తక్కువ ధరకే అందించారు. అలాగే ఒక ఉచిత గిఫ్ట్ కూడా ఇచ్చారు. కాగా రామ్‌సింగ్ తన చిన్నప్పటి నుంచి నాణాలను హుండీలో జమచేస్తూ వస్తున్నాడు. 12 ఏళ్లలో మొత్తం 13, 500 రూపాయల విలువైన నాణాలను దాచుకున్నాడు. వీటిని తీసుకుని షోరూంనకు వెళ్లి, తల్లి కోసం ఫ్రిజ్ కొనుగోలు చేశాడు. కాగా కుమారుడు ఇచ్చిన కానుకను చూసి పప్పూ‌దేవి ఎంతగానో మురిసిపోయింది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM