పాములతో అమ్మాయిలు డాన్స్.. కేసు నమోదు చేసిన పోలీసులు

by సూర్య | Sun, Oct 13, 2019, 12:48 PM

గుజరాత్ లో.. ఒక వేడుకలో కొందరు అమ్మాయిలు పాములను పట్టుకుని కోబ్రా డ్యాన్స్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలై, చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో 12 ఏళ్ల బాలిక సహా ముగ్గురు డ్యాన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వేదికపై నించొని తమ రెండు చేతులతో తాచుపాములను పట్టుకుని వారంతా డ్యాన్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ యువతి ఓ చేతితో పాము, మరో చేతితో కత్తి పట్టుకొని కనపడిందని అటవీ శాఖ అధికారులు చెప్పారు.


ఆ వేడుకకు వచ్చిన వారికి వినోదం అందంచడానికి పాము తోకలు పట్టుకుని ఆ యువతులు ఈ చర్యకు పాల్పడ్డారు. వారి చేతుల్లోంచి ఆ పాములు వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తూ కనపడ్డాయి. అదే సమయంలో యువతులు వేదికపై కోబ్రా డ్యాన్సులనూ కొనసాగించారు. వారికి ఆ పాములను తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తితో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా కేసు నమోదైంది. అరెస్టు చేసిన 12 బాలికను జువెనైల్ కోర్టుకు పంపామని పోలీసులు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఆ యువతులపై కేసు నమోదు చేశారు.

Latest News

 
నాపై ప్రజలకి ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది Sat, May 04, 2024, 03:46 PM
జగన్‌ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు Sat, May 04, 2024, 03:45 PM
ముస్లింలు కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే Sat, May 04, 2024, 03:44 PM
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే Sat, May 04, 2024, 03:43 PM
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎల్లటూరి శ్రీనివాసరాజు Sat, May 04, 2024, 03:37 PM