మద్యం తాగలేదని త్రిపుల్‌ తలాఖ్‌

by సూర్య | Sun, Oct 13, 2019, 12:00 PM

న్యూఢిల్లి : బీహార్‌కు చెందిన ఒక ముస్లిం మహిళ ఆధునికంగా తయారు కావడం లేదని, మద్యం సేవించడం లేదని ఆమె భర్త ఆమెకు త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పాడు. విలాసంగా కనిపించే దుస్తులు ధరించడం లేదని, మద్యం సేవించడం లేదని తన భర్త తనకు త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి విడాకులు ఇచ్చారని నూరి ఫాతిమా అనే మహిళ ఆరోపించింది. ఇమ్రాన్‌ ముస్తాఫా అనే వ్యక్తితో 2015లో వివాహం తరువాత వారు ఢిల్లికి మకాం మార్చారు. అప్పటినుంచి ఆధునిక యువతుల్లాగా తనను కురచ దుస్తులు వేసుకోవాలని, రాత్రి పార్టీలకు వెళుతూ మద్యం సేవించాలని తన భర్త చెప్పాడని ఆమె తెలిపింది. అయితే దీనికి తాను తిరస్కరించానని, అతడు రోజూ తనను కొట్టేవాడని ఆమె చెప్పింది. కొద్ది రోజుల క్రితం తనను ఇల్లు విడిచి వెళ్లిపోవాలన్నాడని, తాను వెళ్లనని చెబితే అక్కడికక్కడ త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి విడాకులు ఇచ్చాడని ఆమె తెలిపింది. రాష్ట్ర మహిళా కమిషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కమిషన్‌ ఆమె భర్తకు నోటీసు జారీ చేసింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM