వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సుకు అక్టోబ‌రు 20 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

by సూర్య | Sun, Oct 13, 2019, 01:29 AM

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలోని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ఆధ్వ‌ర్యంలో 2020 ఫిబ్ర‌వ‌రి 25 నుండి  మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 28వ  శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు( ప‌రీక్ష‌లు)కు అక్టోబ‌రు 20వ తేదీ సాయంత్రంలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని  తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారి తెలియ‌జేసారు. శ‌నివారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేస్తూ,   ఈ స‌ద‌స్సులో 37 వేద శాఖ‌లకు సంబంధించిన ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌కు ఏ గ్రేడ్ స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేస్తారు. భ‌విష్య‌త్తులో టిటిడి, రాష్ట్ర దేవాదాయ శాఖ‌ ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల‌లో అర్చ‌కుల నియామ‌కానికి ఏ గ్రేడ్ స‌ర్టిఫికెట్ క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం అధికారులు తెలిపారు. గ‌తంలో 27 సార్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సులు జ‌రిగాయి. ఇత‌ర వివ‌రాల‌కు టిటిడి వెబ్‌సైట్  www.tirumala.org ను సంప్ర‌దించాల‌ని సూచించారు.  

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM