చెన్నై భేటీతో కొత్త శకం ఆరంభం : మోదీ

by సూర్య | Sat, Oct 12, 2019, 09:41 PM

తమిళనాడులోని కోవలమ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ప్రధాని మోదీ మధ్య భేటీ జరిగింది. చెన్నై సమావేశం రెండు దేశాల మధ్య కొత్త బంధాన్ని ఏర్పరిచిందని ప్రధాని మోదీ తెలిపారు. వూహన్‌ సమ్మిట్‌ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. రెండు దేశాల మధ్య విశ్వాసం పెరిగిందన్నారు. చెన్నై విజన్‌తో కొత్త శకం ఆరంభమైందన్నారు. చైనా, భారత్‌కు చెందిన ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌, విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే ఈ భేటీకి హాజరయ్యారు. తమిళనాడు, చైనా మధ్య బలమైన సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయని మోదీ అన్నారు. గత రెండు వేల ఏళ్ల నుంచి భారత్‌, చైనా ఆర్థిక శక్తులుగా ఉన్నాయన్నారు.


 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM