గంగా హారతి కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్

by సూర్య | Sat, Oct 12, 2019, 08:58 PM

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ హరిద్వార్‌లో పర్యటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి హరిద్వార్‌ వెళ్లారు. గత రెండ్రోజుల నుంచి ఆయన హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు ఆయన ఉదయాన్నే గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిద్వార్‌లోని సాధారణ హోటల్ రూమ్‌లో ఆయన బస చేసి.. స్థానిక ఆశ్రమంలో ఆకులో అల్పాహారం, భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గంగా ప్రక్షాళన కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. అందుకు అనుగుణంగా ప్రజల నమ్మకాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటానన్నారు. గంగా నదిని కాలుష్యానికి గురికాకుండా మన సంస్కృతిని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు పవన్ కళ్యాణ్. దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. ఎందరు రాజకీయ నాయకులు ఉన్నా.. దేశ సంస్కృతిక వైభవాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని అన్నారు పవన్ కల్యాణ్. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు రావడంలేనందు వల్లే.. ఆ లోటును తీర్చాలని మాత్రి సదన్ ఆశ్రమ ప్రతినిధులు తనను కోరారని.. అందుకనే.. నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చానని తెలిపారు పవన్ కల్యాణ్.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM